ఎమ్మెల్యే యార్లగడ్డ పల్లెనిద్రతో పాలన పర్యటన

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర చేయనున్నారు. పాత గన్నవరంలోని లక్ష్మీ తిరుపతమ్మ ఆలయ కళ్యాణ మండపంలో పల్లెనిద్ర అనంతరం, శనివారం ఉదయం ఆలయాల్లో పూజలు చేస్తారు. అనంతరం జాతీయ రహదారి డ్రైనేజీల పరిశీలన, ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు.