మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే

MBNR: భారతదేశ ప్రధానిగా ఉన్న సందర్భంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.