హైవేపై ట్రాక్టర్ ప్రమాదం.. డ్రైవర్ పరిస్థితి విషమం

హైవేపై ట్రాక్టర్ ప్రమాదం.. డ్రైవర్ పరిస్థితి విషమం

TPT: నాగలాపురం బైపాస్ లోని హైవేపై ఫిష్ ఆంధ్ర సమీపంలో ఆదివారం ఒక ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. పిచ్చాటూరు మండలం నీరువాయి దళితవాడకు చెందిన నాగేంద్ర (45) ట్రాక్టర్ నడుపుతుండగా, అది హైవే పక్కన ఉన్న రాతిపైకి ఎక్కి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో నాగేంద్ర కింద పడిపోగా ట్రాక్టర్ చక్రం ఆయన నడుముపై నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర ఆసుపత్రికి తరలించారు.