తాడిగడప ప్రధాన రహదారికి శంకుస్థాపన

తాడిగడప ప్రధాన రహదారికి శంకుస్థాపన

కృష్ణా: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మెరుగవుతుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. సోమవారం పెనమలూరు మండలంతాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి గ్రామంలోని AVM గార్డెన్స్ వద్ద తాడిగడప ప్రధాన రహదారి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.