బస్ కాంప్లెక్స్‌లో వ్యక్తి ఆకస్మిక మృతి

బస్ కాంప్లెక్స్‌లో వ్యక్తి ఆకస్మిక మృతి

ASR: చింతపల్లి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో సోమవారం ఓ వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందాడు. కేడిపేట గ్రామానికి చెందిన మారి అప్పారావు (47) వ్యక్తిగత పనితో చింతపల్లి వచ్చి తిరుగు ప్రయాణానికి బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరే ముందు కిందకు దిగిన ఆయనకు ఒక్కసారిగా మూర్ఛ రావడంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.