భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
AP: భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికినట్లు సమాచారం. కాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జూలై 5 లేదా 8, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు విమానాశ్రయ పనులు త్వరగా పూర్తి చేయాలని GMRను ప్రభుత్వం కోరింది.