హిందూపురంలో బోల్తా పడ్డ ఆటో.!
సత్యసాయి: హిందూపురం(మం) మలగూరు సమీపంలో ఎదురుగా వచ్చిన బస్సును తప్పించబోయే క్రమంలో మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.