నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చు

MNCL: రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్త సుజాత సూచించారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాల రైతులకు విత్తనాలలో నాణ్యత, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పంటలు వేసే ముందు భూసార పరీక్షలు తప్పకుండా చేయించాలని, దాని ద్వారా పంట దిగుబడి ఎక్కువగా వస్తుందన్నారు. పంటల సాగులో అధికారుల సూచనలు పాటించాలన్నారు.