VIDEO: 14 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి: మంత్రి
RR: చేవెళ్ళ బస్సు ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో 19 మంది మృతి చెందారని, అందులో 14 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని తెలిపారు. మృతుల్లో ఒకరు కర్ణాటకకు చెందిన మహిళ కాగా.. టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని వివరాలు వెల్లడించారు.