రైల్వే ప్రాజెక్టుల వేగంపై సీఎం సమీక్ష
Vsp: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో రైల్వే జోనల్ జీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో దక్షిణ మధ్య, ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్ రైల్వేల జీఎంలు పాల్గొన్నారు. అమరావతి, కోటిపల్లి-నర్సాపూర్, నడికుడి-శ్రీకాళహస్తి వంటి కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.