బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

SRD: నిజాంపేట మండలం నాగ్దర్ రామచంద్ర తండా సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న రాజు అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన ఒక బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో అతడిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.