పోచారం ప్రాజెక్టు మరోసారి ఓవర్ ఫ్లో

పోచారం ప్రాజెక్టు మరోసారి ఓవర్ ఫ్లో

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు మరోసారి ఓవర్ ఫ్లో అవుతోంది. పక్షం రోజుల క్రితం ఎగువన కురిసిన భారీ వర్షంతో ప్రాజెక్టు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఫలితంగా బ్రిడ్జి వద్ద రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద చేరడంతో జలకల సంతరించుకుంది.