ప‌వ‌న్ కోలుకోవాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు

ప‌వ‌న్ కోలుకోవాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు

VSP: జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో మంగ‌ళ‌వారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కోసం ప్రార్థించగా, అనంతరం అక్కడ ఉన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు.