గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు సిలువ యాత్ర
HNK: పరకాల పట్టణంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని కారుణ్య యేసు క్యాథలిక్ ప్రార్థన మందిర ఫాదర్ బాలరాజు ఆధ్వర్యంలో శుక్రవారం యేసు సిలువ యాత్ర కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు సిలువ యాత్రను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ ప్రెసిడెంట్ మడికొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.