విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేసిన కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరీక్షా ప్యాడ్‌లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. దత్తత తీసుకున్న ఈ పాఠశాల పేరు నిలబెట్టాలని, ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహకాలు అందజేస్తానని భరోసా ఇచ్చారు.