సబ్ డివిజన్ ప్రజలకు డీఎస్పీ సూచనలు

శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటుకు ఎటువంటి చలానా చెల్లించకుండా ఉచితంగా https://ganeshutsav.net ద్వారా పోలీసు వారి అనుమతులు పొందాలని టౌన్ డీఎస్పీ సీహెచ్.వివేకానంద తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్ శాఖ జారీ చేసిన భద్రత నిబంధనలు జాగ్రత్తలు కమిటీ నిర్వాహకులు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.