చెరువులో లైన్‌మెన్ మృతదేహం

చెరువులో లైన్‌మెన్ మృతదేహం

GDWL: ఐజ మండలంలో విషాదం నెలకొంది. కేశవరం - వేణిసోంపురం పరిధిలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్, చిన్న తాండ్రపాడు చెరువులో మృతి చెంది కనిపించాడని ఇవాళ స్థానికులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శ్రావణ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.