చెరువుల పునరుద్ధరణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్
సత్యసాయి: జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు 'జలధార-జలహారతి' పథకం కింద చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూజ.. చెరువుల్లో పూడిక తీతతో పాటు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న జంగిల్ కటింగ్ పనులు చేపట్టాలని సూచించారు. తూములు, అలుగుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు.