అగ్నిప్రమాదం.. నైట్‌క్లబ్బులు మూసివేత

అగ్నిప్రమాదం.. నైట్‌క్లబ్బులు మూసివేత

గోవాలోని 'బిర్క్ బై రోమియో లేన్'లో అగ్నిప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్కడి అధికారులు నైట్‌క్లబ్బులపై చర్యలు చేపట్టారు. రూల్స్, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీలు చేపట్టి 2 నైట్‌క్లబ్బులను మూసివేశారు. నిన్న ఉత్తర గోవా వేగటోర్ బీచ్‌లోని 'కేఫ్ CO2 గోవా'కు సీల్ వేయగా.. 2 రోజుల క్రితం అదే ప్రాంతంలోని గోయా క్లబ్‌పై చర్యలు తీసుకున్నారు.