తల్లిదండ్రులు.. మీ పిల్లలు జాగ్రత్త!

తల్లిదండ్రులు.. మీ పిల్లలు జాగ్రత్త!

MBNR: జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో పిల్లలు ఇంటివద్ద ఉంటున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో నుంచి పనికి వెళ్లిన తర్వాత.. పిల్లలు చెరువులు, వాగుల వద్దకు వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు, పలువురు హెచ్చరిస్తున్నారు.