వడివడిగా సాగుతున్న అంతర్గత డ్రైనేజీ పనులు

వడివడిగా సాగుతున్న అంతర్గత డ్రైనేజీ పనులు

VKB: కొడంగల్ మండల కేంద్రంలోని లాహోటి కాలనీలో అంతర్గత డ్రైనేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కేరళలో ఉపయోగించే అత్యాధునిక డ్రైనేజీ టెక్నాలజీ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనివలన మురుగునీరు బయటికి వచ్చి దుర్వాసన వెదజల్లే అవకాశం ఉండదని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. అందువల్లనే కేరళ సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.