బేతాని కాలనీలో నీటి ట్యాంకర్ బోల్తా
BPT: బాపట్ల పట్టణంలోని బేతాని కాలనీ, జగనన్న కాలనీలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్న మున్సిపాలిటీ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. నీటి సరఫరా కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంకర్ రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో అందులోని నీరంతా నేలపాలైంది. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.