1000 దాటిన కరోనా కేసుల సంఖ్య

1000 దాటిన కరోనా కేసుల సంఖ్య

దేశంలో మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో 750 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ మహమ్మారి కేరళలో వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మొత్తం 400 కేసులు నమోదయ్యాయి. అలాగే ఢిల్లీలో వైరస్ కేసుల సంఖ్య 100 మార్క్‌ను దాటింది. దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు వెయ్యి దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.