VIDEO: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం బుక్కపట్నం మండలంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్, విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి, తాత్కాలికంగా ఉపాధ్యాయుడిగా మారారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి, చదువుపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. కలెక్టర్ ఆకస్మిక పర్యటన, బోధనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు.