దర్గాలో కలెక్టర్ ప్రత్యేక ప్రార్థనలు

దర్గాలో కలెక్టర్ ప్రత్యేక ప్రార్థనలు

NRPT: కొల్లంపల్లి దర్గాలో సోమవారం సర్వ ధర్మ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. అనంతరం ఆమె దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో సర్వ ధర్మ సమ్మేళనాలు కీలకమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సామరస్య భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.