'MDT చికిత్సతో వ్యాధి పూర్తిగా నయం అవుతుంది'
GNTR: కుష్టు వ్యాధి MDT చికిత్సతో పూర్తిగా నయం అవుతుందని, ఈ చికిత్స అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో LCDC (Leprosy Case Detection Campaign) పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. నవంబర్ 17 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.