వెదురుకుకుప్పంలో వైభవంగా వినాయక చవితి

వెదురుకుకుప్పంలో వైభవంగా వినాయక చవితి

CTR: వెదురుకుప్ప మండలంలో వినాయక చవితి పర్వదినాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు గ్రామాలలో యువకుల వినాయక మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని వేణుగోపాలపురంలో వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.