జూన్ నెలలో ఖర్చుల మోత

MBNR: ఉమ్మడి జిల్లా ప్రజలకు జూన్ నెల ఖర్చుల మాసంగా మారింది. రైతులు వ్యవసాయానికి సిద్ధమవడం వల్ల విత్తనాలు, ఎరువులు కొనాల్సి ఉంటుంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో పిల్లలకు నోట్ బుక్స్, యూనిఫామ్, తదితరాల కొనుగోలు తప్పనిసరి అవుతుంది. ప్రైవేటుగా చదివిస్తే ఫీజు తడిసి మోపెడవుతుంది. వీటికి తోడు పెరిగిన కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.