VIDEO: జాతీయ రహదారిపై లారీ బోల్తా
KMR: బిక్కనూర్ మండలంలోని సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై హరియాణా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, లారీ రహదారికి అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ నెలకొంది.