తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
NTR: మైలవరంలో శనివారం తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ముందు వెళ్తున్న బస్సును ఢీకొని, స్టూడెంట్స్ పార్క్ చేసి ఉన్న బైక్‌లపై దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.