కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
AP: రాష్ట్రంలో కారుణ్య నియామకాలు పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఏటా జరిగే రెగ్యులర్ నియామకాల కంటే కారుణ్య నియామకాలే ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది. దీంతో నిరుద్యోగుల హక్కులకు విఘాతం కలుగుతోందని.. కారుణ్య నియామకానికి బదులు ఎక్స్‌గ్రేషియా లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చేలా కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని న్యాయస్థానం ఆదేశించింది.