డివిజన్ విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

NGKL: అచ్చంపేట డివిజన్ విద్యుత్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉండొద్దన్నారు.