VIDEO: నూజివీడులో జోరుగా కురిసిన వర్షం

VIDEO: నూజివీడులో జోరుగా కురిసిన వర్షం

ELR: నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాలలో సోమవారం జోరుగా వర్షం కురిసింది. ఉదయం నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు వేసవిని తలపిస్తూ వచ్చిన ఎండతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హఠాత్తుగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీపావళి పర్వ దినోత్సవం కావడంతో ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణం దారులు లబోదిపోమంటున్నారు.