‘పారిశుధ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి’

‘పారిశుధ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి’

AKP: గ్రామాల్లో పారిశుధ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. ఇవాళ కోటవురట్ల మండలం తంగేడు గ్రామంలో నిర్వహించిన పారిశుధ్యం పరిశుభ్రత స్పెషల్ డ్రైవ్‌లో ఎంపీడీవో పాల్గొన్నారు. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించి ఎరువుగా మార్చాలన్నారు.