ప్రతి కాలనీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేసేలా చర్యలు

ప్రతి కాలనీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేసేలా చర్యలు

NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలు అందుబాటులో లేక వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే ప్రజలకు మరింత చేరువలో రేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.