VIDEO: టీచర్స్ కాలనీలో పాముల బెడద
కృష్ణా: గుడివాడ టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాలు ప్రస్తుతం పిచ్చి మొక్కలు, ముళ్ళకంపలతో నిండిపోయి పాము రోడ్డుపైకి రావడంతో కాలనీ వాసులు నిన్న ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కళాశాల విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు తీవ్ర భయంతో జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.