'ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించాలి'

'ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించాలి'

JN: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించాలని స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ధర్మసాగర్ మండలం దేవన్నపేటలో ఉన్న దేవాదుల పైప్ లైన్‌ను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సందర్శించారు. నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.