ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

KRNL: జిల్లాలో నీట్ UG పరీక్ష ప్రశాంతంగా జరిగాయని, 98.10 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఆదివారం కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల, క్లస్టర్ యూనివర్సిటీలలో నీట్ UG పరీక్షలు జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ పరీక్షకు మొత్తం 4466 మందికి గాను, 4381 విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.