కార్తీకమాసానికి ముస్తాబవుతున్న దక్షిణకాశీ ఆలయం

SKLM: దక్షిణకాశీగా పేరుగాంచిన జలుమూరులోని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభకు ముస్తాబవుతోంది. నవంబరు 2 నుంచి కార్తీక మాసం ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో స్వామి దర్శనం సులువుగా జరిగేందుకు బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రభాకరరావు తెలిపారు. మరో 2 రోజుల్లో పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.