పేద రెడ్లను ఆదుకోవాలని వినతి

CTR: రాష్ట్రంలోని రెడ్డి జనాభాలో 80 శాతం మంది పేదలు ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రెడ్డి అభ్యుదయ సేవా సంఘం నాయకులు కోరారు. ఏపీ రెడ్డి వెల్ఫేర్ కార్పొరేషన్‌కు పాలకమండలి ఏర్పాటు చేయాలని నాయకులు పలమనేరులో ఆర్డీవో భవానికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్‌కు ప్రతి ఏడాది రూ.2,000 కోట్లు మంజూరు చేయాలన్నారు.