'డ్రాప్ అవుట్స్ లేని జిల్లాగా మార్చాలి'

CTR: చిత్తూరు జిల్లాను స్కూల్ డ్రాప్ అవుట్స్ లేని జిల్లాగా మార్చాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ ఇంఛార్జ్‌లతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. టీచర్లు విద్యార్థులతో ఎక్కువ సమయం గడిపి వారిలో విద్యా ప్రమాణాలు పెరిగేలా చూడాలని సూచించారు. అప్పుడే వారి మానసిక స్థితిని గుర్తించగలమన్నారు.