జ్వరంతో విద్యార్థి మృతి

ప్రకాశం: కొమరోలు మండలం గోనేపల్లికు చెందిన వెంకట నారాయణ 10వ తరగతి విద్యార్థి అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో హాస్టల్లో ఉంటూ విద్యార్థి చదువుకుంటున్నాడు. తీవ్ర జ్వరం రావడంతో ఇంటికి వచ్చి జ్వరం తగ్గాక తిరిగి గుంటూరుకు వెళ్ళాడు. మరొకసారి అనారోగ్యం బారిన పడటంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.