యథావిధిగా నైట్ బస్ సర్వీసులు పునరుద్ధరణ
ASR: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో రద్దు చేసిన విశాఖ, సీలేరు, భద్రాచలం నైట్ బస్ సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం డిపో మేనేజర్ మాధురి తెలిపారు. మంగళవారం నుంచి గూడెం కొత్త వీధి మీదుగా భద్రాచలం, సీలేరు రూట్లలో నైట్ బస్సులు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని డిపో మేనేజర్ పేర్కొన్నారు.