'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి'

SRD: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.