'ఖేడ్ ఇండోర్ స్టేడియం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి'

'ఖేడ్ ఇండోర్ స్టేడియం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి'

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని షెట్కార్ క్రీడా మైదానాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైదానంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె, ఇండోర్ స్టేడియం నిర్మాణం, మరమ్మతుల కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డిని ఆదేశించారు. అలాగే స్టేడియం పరిధిలోని దుకాణాల అద్దె బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.