ఇంటింటి ప్రచారం చేసిన వైసీపీ నాయకులు

VZM: ఎస్.కోట మండలం వినాయక పల్లిలో మండల YCP అధ్యక్షులు మోపాడ కుమార్ ఆధ్వర్యంలో 'బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ' పేరుతో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల్లో అమలు కాని హామీలను వివరించారు. హామీలు అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. హామీలు అమలు చేసేంతవరకు ప్రతిపక్షంగా పోరాడుతామని స్పష్టం చేశారు.