బస్టాండ్ దుస్థితి.. ప్రయాణికులకు ఆవేదన

బస్టాండ్ దుస్థితి.. ప్రయాణికులకు ఆవేదన

BPT: కారంచేడు ఆర్టీసీ బస్టాండ్ దారుణ స్థితిలో ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లాబ్‌ పెచ్చులు ఊడిపోవడం, నేల పగుళ్లు రావడంతో ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఎండ, వానల్లో ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.