సివిల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ రక్తదాన శిబిరం
VSP: అంతర్జాతీయ సహకార సంవత్సరంలో భాగంగా ఇండియన్ నేవీ సివిల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా నావల్ డాక్యార్డ్ పీఎంవో సర్జికల్ కెప్టెన్ కౌస్తవ చటర్జీ పాల్గొని రక్తదానం గొప్ప సేవ అని అన్నారు. గౌరవ అతిథి రెడ్డి వెంకటరావు రక్తదాత ముగ్గురికి ప్రాణదాత అని శుక్రవారం పేర్కొన్నారు.