'రైతు సంక్షేమానకి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

'రైతు సంక్షేమానకి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

PLD: నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మిరప పంట పొలాలను సందర్శించి, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. మిరప సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రస్తుత పంట పరిస్థితులు, ప్రభుత్వం నుండి అవసరమైన సహాయం గురించి రైతులు ఆయనకు వివరించారు.