VIDEO: కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
GDWL: ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మిల్లులోనే సీసీఐ కొనుగోలు కేంద్రం ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కార్మికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అనంతనరం అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేసింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.